మంత్రి దానం నాగేందర్ బుగ్గపై డి శ్రీనివాస్ ముద్దు

కాగా డిఎస్ నామినేషన్ పర్వానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ఇరవై మంది మంత్రులు, పలువురు పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. కెవిపి రామచంద్రా రావు కూడా పాల్గొన్నారు. కాగా డిఎస్‌కు పలువురు కాంగ్రెసు నేతలు అభినందనలు తెలియజేశారు. డిఎస్‌ను సిఎం, పిసిసి చీఫ్ ప్రతిపాదించారు. కిరణ్ మొదటి సంతకం, బొత్స రెండో సంతకం చేశారు.
కాగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ డిఎస్‌కు ఎమ్మెల్సీ స్థానం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. డిఎస్ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తారన్నారు. ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications