బకరాలను చేయాలనుకుంటున్నారు: నాగం జనార్ధన్‌రెడ్డి

సీమాంధ్ర నేతల ప్రకారం నవంబర్ 1వ తేదిన పండుగ అని మరి ఇంతమంది పోలీసోళ్లు తెలంగాణలో ఎందుకని ఎవరైనా పండుగను పోలీసోళ్ల మధ్య చేసుకుంటారా అని ప్రశ్నించారు. స్వాతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు తమ మద్దతు ఉంటుందన్నారు. సమైక్య రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కోసం 610 జివోతో సహా దేనిని అమలు చేయలేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని ఆయన ఖండించారు. కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యలు కాలాయాపనకే అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపిలోకి వెళ్లేది లేదన్నారు.
తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు టిడిపి చీఫ్ చంద్రబాబును అంటిపెట్టుకొని ఉండటం సిగ్గు చేటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు పడిపోకుండా చంద్రబాబు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. ఇప్పటికీ తాము రెండుసార్లు రాజీనామాలు చేసినప్పటికీ ఆమోదించడం లేదన్నారు. గవర్నర్ నరసింహన్ ఆంధ్రుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీలోని ఎనిమిదో చాప్టర్ అమలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications