Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హీరోయిన్ శ్రియ జై తెలంగాణ నినాదం

Shriya Saran
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ శ్రియ జై తెలంగాణ అన్నారు. శనివారం హైదరాబాదులోని రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో హీరో అల్లరి నరేష్, హీరోయిన్ శ్రియ నటిస్తున్న ఓ చిత్రం చిత్రీకరణకు సిద్ధమైంది. ఇది ఎస్వీ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోంది. వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో ఓ చిత్రం చిత్రీకరణ జరుగుతోందని తెలుసుకున్న పలువురు తెలంగాణవాదులు, విద్యార్థులు అక్కడకు వచ్చి తమ భాషను, యాసను సినిమాలలో కించపరుస్తున్నారని ఆరోపిస్తూ షూటింగ్ నిర్వాహకులపై మండిపడ్డారు.

హీరోయిన్ శ్రియ కారుపై రాళ్లు రువ్వారు. జై తెలంగాణ నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రియతో జై తెలంగాణ అనే నినాదాలు చేయించారు. సెట్టింగ్ వేసి మేకప్ పూర్తి చేసుకొని కెమెరా ఆన్ చేసే సమయానికి పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో చిత్ర యూనిట్ షూటింగ్ రద్దు చేసుకొని అక్కడి నుండి వెళ్లి పోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+