తెలంగాణపై కాలపరిమితితో రెండో ఎస్సార్సీ ఏర్పాటు

కాలపరిమితి పెడుతూ రెండో ఎస్సార్సీని వేస్తే తెలంగాణ నాయకులకు కూడా అభ్యంతరం ఉండకపోవచ్చునని అంటున్నారు. అందుకు తెలంగాణ నాయకులను తాము ఒప్పిస్తామని కొందరు పార్టీ ముఖ్య నాయకులు పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండో ఎస్సార్సీ వేయడమనేది పార్టీ విధానమే కాబట్టి దానికి పార్టీ నాయకులంతా కట్టుబడి ఉండాలని పార్టీ అధిష్టానం ఆదేశించి అవకాశం ఉంది. అయితే, కాంగ్రెసు తెలంగాణ నాయకుల నుంచి రెండో ఎస్సార్సీకి వ్యతిరేకత ఎదురవుతోంది. సీమాంధ్ర నాయకులు కూడా దీనికి అంగీకరించే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి కొంత మంది నాయకులు అందుకు అంగీకరించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications