వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి కేసులో రాజగోపాల్‌ను అరెస్టు చేశాం: సిబిఐ జెడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

cbi laxminarayana
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో మాజీ అధికారి రాజగోపాల్‌ను తాము అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఆదివారం స్పష్టం చేశారు. గాలికి అక్రమ మైనింగులు కట్టబెట్టడంలో రాజగోపాల్ పాత్ర ఉందని ఆయన చెప్పారు. అందుకే అరెస్టు చేసినట్లు చెప్పారు. ఓఎంసి కేసులో రాజగోపాల్ నాలుగో నిందితుడని చెప్పారు. కాగా గాలికి ఆరు మైనింగ్ లీజులు కట్టబెట్టడంలో రాజగోపాల్ పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గనుల కోసం అంతకుముందు వేరే వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి కాకుండా గాలి జనార్ధన్ రెడ్డి దరఖాస్తు చేసుకోగానే ఆయనకు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అనుమతుల అనంతరం అక్రమ మైనింగ్ తరలిస్తున్నా రాజగోపాల్ పట్టించుకోలేదు.

కాగా శనివారం ఉదయం సిబిఐ అధికారులు ఆయనను తమ అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు ఓబుళాపురం మైనింగ్స్‌పై ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. 2009లోనే ఈయనపై సిబిఐ కేసు నమోదు చేసింది. రాజగోపాల్‌‌ను అరెస్టు చేసిన సిబిఐ ఆయనపై 120బి, 420, 379, 411, 427, 447, 409, 468 తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదైనట్లుగా సమాచారం. కాగా రాజగోపాల్ అరెస్టును సిబిఐ అధికారులు అర్ధరాత్రి ధృవీకరించారు.

English summary
CBI JD Laxminarayana confirmed that they will arrest former mines officer Rajagopal today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X