హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్కామ్‌లపై పితాని గురి పెట్టిందే మంత్రులను?

By Pratap
|
Google Oneindia TeluguNews

Pithani Satyanarayana
హైదరాబాద్: కుంభకోణాలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ బుధవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాలకు పూర్తిగా అధికారులనే నిందించలేమని, కొందరు మంత్రులు కూడా అందుకు బాధ్యులేనంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ఏయే మంత్రులను ఉద్దేశించి ఆయన చేశారనే విషయంపై రాజకీయ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ మంత్రులకు తెలిసి, మంత్రుల అంగీకారంతోనే జరుగుతాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్, గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో, ఎమ్మార్ కేసుల్లో ఐఎఎస్ అధికారులు కూడా చిక్కుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయా శాఖలను నిర్వహించిన మంత్రులను కూడా బాధ్యులను చేయాలని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు భావిస్తున్నారు.

జీవోల జారీకి అధికారులు బాధ్యులు కారని ఆయన చెప్పారు. తన వద్దకు అధికారులు పంపిన కొన్ని ప్రతిపాదనలను తాను వెనక్కి పంపానని, మంత్రులు ఆ పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చట్టానికి విరుద్ధమైన, ప్రభుత్వానికి నష్టం కలిగించే ప్రతిపాదనలను అధికారులు పంపితే తిప్పికొట్టే అవకాశం మంత్రులకు ఉంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిబిఐ దర్యాప్తును ఆహ్వానించి, నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన అన్నారు.

English summary
Social Welfare Minister Mr Pithani Satyanarayana observed on Wednesday that some of his Cabinet colleagues were responsible for certain decisions that eventually led to scams and one could not always blame bureaucrats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X