వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు పత్రాలు ఐటికి ఇవ్వండి: సిబిఐతో కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఆదాయం పన్ను శాఖకు ఇవ్వాలని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు సిబిఐని బుధవారం ఆదేశించింది. జగన్, ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు అడిగినా ఆ పత్రాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైయస్ జగన్ కేసులో స్వాధీనం చేసుకున్న పత్రాలను బెంగళూర్ ఆదాయం పన్ను శాఖకు కూడా ఇవ్వాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. జగన్, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను తమకు ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన ఐటి శాఖ, బెంగళూర్ ఐటి శాఖ ఇంతకు ముందు సిబిఐని కోరాయి.

సోదా పత్రాలు ఇవ్వడానికి తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని, అయితే కోర్టు అనుమతితో వాటిని తీసుకోవాలని సిబిఐ ఐటి శాఖలకు చెప్పింది. దీంతో బెంగళూర్ ఐటి శాఖతో పాటు రాష్ట్రానికి చెందిన ఐటి శాఖ కూడా విడివిడిగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ సోదా పత్రాలను ఐటి శాఖకు ఇవ్వాలనే విజ్ఞప్తిపై వైయస్ జగన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఏయే పత్రాలు కావాలో అడిగితే తాము ఐటి శాఖకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, సిబిఐ స్వాధీనం చేసుకున్న పత్రాల్లో వ్యక్తిగతమైనవి కూడా ఉన్నాయని, అందువల్ల వాటిని ఇవ్వకూడదని జగన్ తరఫు న్యాయవాది వాదించారు.

English summary
Nampally Court ordered to give documents to IT department seized in YS Jagan assets case and Emaar properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X