లైఫ్‌పార్ట్‌నర్ రేప్ చేశాడని హైదరాబాద్ యువతి ఫిర్యాదు

దీంతో వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తామిద్దరం దుబాయ్‌లో సహజీవనం చేస్తున్న సమయంలో అతని తల్లిదండ్రులు అక్కడే నెల రోజులు ఉన్నారని, తమ సంబంధం గురించి వారికి తెలుసునని బాధితురాలు పోలీసులకు వివరించింది. 2010లో నిందితుడు తన సోదరి పెళ్లి కోసం ముంబై వెళ్లాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు అతను కూడా అప్పుడే ఓ యువతిని పెళ్లాడాడు. దుబాయ్ తిరిగి వచ్చాక తనతో సహజీవనం చేస్తున్న బాధితురాలికి ఈ విషయం చెప్పకుండానే ఆమెతో తన సంబంధాన్ని కొనసాగించాడు. కొంతకాలం తర్వాత నిందితుడు ఆమె నుండి దూరం అయ్యేందుకు నిర్ణయించుకోవడంతో తనతో ఇన్నాళ్ల నుండి ఉంటున్నప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ప్రశ్నించింది.
అప్పుడతను తనకు వేరే యువతితో పెళ్లైన విషయాన్ని చెప్పి తన భార్యకు విడాకులు ఇచ్చి తనను చేసుకుంటానని చెప్పాడు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి తమిద్దరి పెళ్లి విషయాన్ని అతని తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వచ్చారు. వారు అందుకు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతని లాప్ టాప్ నుండి అసభ్యకరమైన చిత్రాలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications