మరో పదేళ్లా?: రాహుల్‌గాంధీపై మాయావతి విమర్శలు

బిఎస్పీకి భయపడి రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా యుపిలో పర్యటిస్తున్నారన్నారు. యుపిలో తమ పార్టీ బలహీనంగా ఉండటం పట్ల ఆ పార్టీ ఆందోళన చెందుతోందని అందుకోసమే రాహుల్ పార్టీని బలపర్చడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారన్నారు. బిఎస్పీ హయాంలోనే దళితులకు, మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెసు ద్వారా వారికి న్యాయం జరగదన్నారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీకి కలలో కూడా బిఎస్పీ ఎన్నికల సింబల్ ఏనుగే కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications