వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై అధిష్టానాన్ని తప్పు పట్టిన ఎమ్మెస్సార్

By Pratap
|
Google Oneindia TeluguNews

M Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జాప్యానికి ఆర్టీసి చైర్మన్, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు తమ పార్టీ అధిష్టానాన్ని తప్పు పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యానికి పార్టీ అధిష్టానమే కారణమని ఆయన అన్నారు. 79వ జన్మదినం సందర్భంగా ఆయనను పలువురు కాంగ్రెసు నేతలు శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీమాంధ్ర నాయకుల వల్ల పార్టీ అధిష్టానం ఆలస్యం చేస్తోందని, 2014 లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు మాదిరిగానే తనకు గవర్నర్ పదవు దక్కుతుందని ఆయన ఆశించారు. ఆర్టీసి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగుందని ఆయన కితాబు ఇచ్చారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపుల గురించి తనకు తెలియదని, మంత్రివర్గంలో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన మంత్రులకు ఆ వివరాలు తెలుసునని, వారిని విచారిస్తే వాస్తవాలు బయటపడుతాయని ఆయన అన్నారు. మంత్రులను సంప్రదించుకుండానే వైయస్ హయాంలో కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆయన చెప్పారు.

English summary

 RTC chairman M Satyanarayana Rao has blamed high command on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X