కూల్చితే ఊరుకోం: బాబుకు కొండా సురేఖ హెచ్చరిక

దళిత మంత్రి ఐన శంకర రావును మంత్రివర్గం నుండి తొలగించడం సరికాదన్నారు. శంకర రావు మంత్రులపై చేసిన పిటిషన్‌లపై విచారణ జరిపించుకొని తాము అవినీతిపరులం కాదని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. వైయస్ఆర్‌ను అవినీతిపరుడు అన్నప్పుడు అదే శంకర రావును ప్రోత్సహించారన్నారు. మంత్రివర్గ అవినీతి బయటకు రాకుండా ఉండేందుకే ఆయనను తప్పిస్తున్నారన్నారు. అనర్హత పిటిషన్‌లపై తాము పదే పదే స్పీకర్‌కు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. స్పీకర్ తమపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం టెండర్ల కోసమే రాజం కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ప్రభుత్వం పెట్టిన కేసులు వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.












Click it and Unblock the Notifications