బాలయ్య, జూ ఎన్టీఆర్ ఇద్దరూ సమానమే: అంబికా కృష్ణ

బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం సాధిస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోటీ చేసినా బాలకృష్ణ గెలుస్తారని ఆయన చెప్పారు. పార్టీకి బాలకృష్ణ పూర్తి స్థాయిలో సేవలందించడానికి ముందుకు రావడం వల్ల పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని, పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. పన్నులు, వడ్డీలతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications