బాబును ఎన్నైనా అనగలం: జగన్ వర్గం ఎమ్మెల్యే

YS Jagan
హైదరాబాద్: తాము అనదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎన్నైనా అనగలమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై చంద్రబాబు వాడిన పదజాలంపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు వాడుతున్న భాషకు ఆయనే సిగ్గుపడాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబును తాము ఎన్నైనా అనగలమని, అయితే అటువంటి భాషను తమ నాయకుడు అంగీకరించబోరని, తాము అటువంటి భాషను వాడదలుచుకోలేదని ఆయన అన్నారు. పదవీ వ్యామోహంతోనే చంద్రబాబు వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర పదజాలం ప్రయోగిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.

చంద్రబాబుకు విలువలు లేవని, రాజకీయాలపై అవగాహన లేదని అనిపిస్తోందని, చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవడం అవసరమని ఆయన అన్నారు. చంద్రబాబుకు పేద ప్రజలపై ప్రేమ లేదని, పదవిపైనే చంద్రబాబుకు మోజు అని ఆయన అన్నారు. జగన్‌ అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు రుజువులు చూపగలరా అని ఆయన అడిగారు. చంద్రబాబు ఒక్క కేసునైనా ఎదుర్కోలేదని, ప్రతి కేసులోనూ స్టే తెచ్చుకుని తప్పించుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై లాంటి కేసే చంద్రబాబుపై వేశారని, దానిపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. కేసులను ఎదుర్కోవడానికి చంద్రబాబు భయపడుతున్నారని, ఆ భయం చూస్తుంటే చంద్రబాబు ఎన్నో తప్పులు చేసి ఉంటారని అనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రజలు చందాలు వేసుకుని వైయస్ విగ్రహాలను స్థాపించుకున్నారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+