పెళ్లికి హాజరై సిబిఐకి పట్టుబడిన సునీల్ రెడ్డి?

సునీల్ రెడ్డి వ్యాపారంపై కూడా సిబిఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సునీల్ రెడ్డి గృహ అలంకరణ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ దుకాణంపై సిబిఐ ఓ కన్ను వేసి ఉంచినట్లు తెలుస్తోంది. అలంకరణ వస్తువుల దిగుమతుల ముసుగులో జగన్‌కు సంబంధించిన నిధులను విదేశాలకు తరలించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనూ సిబిఐ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.
సునీల్ రెడ్డి అరెస్టు వైయస్ జగన్‌ను తీవ్రంగానే కలత పెట్టినట్లు అర్థమవుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం సాయంత్రం దిల్‌కుషా అతిథిగృహం వద్ద ఆందోళనకు దిగారు. సునీల్ రెడ్డికి నైతిక మద్దతు తెలపడానికి వచ్చామని, దీనిపై సిబిఐ అధికారులతో మాట్లాడుతామని వారు చెప్పారు. వారిని కలవడానికి సిబిఐ అధికారులు నిరాకరించారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications