హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు డైరెక్షన్‌లోనే: సిబిఐపై మళ్లీ జగన్ పార్టీ నేతల ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shobha Nagireddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో సిబిఐ నడుస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగి రెడ్డి గురువారం ఆరోపించారు. ఏదో ఒక విధంగా ఎమ్మార్ కేసులో తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారన్నారు. ఎమ్మార్‌పై నాటి మంత్రివర్గ ఉప కమిటీ నిర్ణయాలనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని, ఆ కమిటీని సిబిఐ విచారించిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు, కోనేరు ప్రసాద్‌ల మధ్యనున్న సంబంధం అందరికీ తెలుసునన్నారు. జగన్‌కు ఉన్న ప్రజాధరణను చూసి ఓర్వలేకనే ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు నీచమైన కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కంటే ముందుగా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణకు నార్కో టెస్ట్‌లు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సిబిఐ దర్యాఫ్తు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని మరో నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అంతకుముందు వేరుగా అన్నారు. స్టైలిష్ హోం రంగారావును వదిలేసి సిబిఐ అమాయకుడైన సునీల్ రెడ్డిని అరెస్టు ఎందుకు చేసిందన్నారు. బాబు, కాంగ్రెసు ఫిక్సింగ్ చేసుకొని రైతులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. బాబు తమ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం కంటే సునీల్ రెడ్డి అరెస్టే ప్రధానంగా ఎల్లో మీడియా వార్తలు ప్రచురించడమేమిటన్నారు.

English summary
YSR Congress Party leaders fired again at CBI today. CBI is going with TDP chief Chandrababu Naidu direction, accused Shobha Nagi Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X