హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టువీడని జూడాలు, మొండి వైఖరన్న మంత్రి డిఎల్

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: తమ డిమాండ్ల విషయంలో జూనియర్ డాక్టర్లు పట్టువీడడం లేదు. గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోతే అత్యవసర సర్వీసులను కూడా బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు అన్నారు. అయితే, జూనియర్ డాక్టర్లది మొండివైఖరి అని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. ఇప్పటికే వారి డిమాండ్లన్నీ పరిష్కరించామని, ఒక్క స్టయిఫండ్ విషయంలోనే 40 శాతం డిమాండుకు 25 శాతంగా అంగీకరించామని ఆయన అన్నారు. అయినా జూడాలు మొండిగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. ఒక్కో డాక్టరుపై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రబుత్వం వారి డిమాండ్లు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తిసుకుంటోందని ఆయన అన్నారు.

రానున్న ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదులోని అమీర్‌పేట, ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలోని నూతన ఆస్పత్రుల నిర్మాణం చేపడుతామని ఆయన చెప్పారు. స్టయిఫండ్‌ను క్రమబద్దీకరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారంనాడు ఐదో రోజుకు చేరుకుంది. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

English summary
As Jr Doctors continue fast, minister DL Ravindra Reddy has opposed their attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X