బాబును నమ్మితే చిప్ప మిగిలింది!: భిక్షమెత్తిన బంగి

Bangi Ananthaiah
కర్నూలు: ఎప్పుడూ వినూత్నంగా నిరసన తెలిపే కర్నూలు జిల్లా మాజీ మేయర్ బంగి అనంతయ్య బుధవారం మరోసారి విచిత్రంగా తన నిరసనను తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ ఆయన బుధవారం కర్నూలు జిల్లాలో భిక్షమెత్తుకుంటూ నిరసన తెలిపారు. గతంలోనూ ఆయన బాబుపై మండిపడ్డారు. ఈసారి విచిత్రంగా భిక్షమెత్తుతూ బాబు వైఖరిని తూర్పార బట్టారు. చంద్రబాబును నమ్ముకుంటే తెలుగు తమ్ముళ్లకు చిప్పే గతి అని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి తాను తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పని చేస్తున్నానని కానీ తనకు చిప్ప తప్ప ఏమీ మిగలలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం సాక్షిగా బంగి అనంతయ్య భిక్షాటన చేశారు. తనకు కలిసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జాగ్రత్త బ్రదర్ అంటూ హెచ్చరించారు. కాగా గతంలో పలుమార్లు ఆయన వివిధ సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశారు. వినూత్న రీతిలో నిరసన తెలపడంలో బంగి తీరే వేరు. ఓసారి రిక్షా తొక్కుతూ, మరోసారి మహిళ వేషం ధరించి, ఇంకోసారి ఎన్టీఆర్ వేషంతో ఇలా పలు సందర్భాల్లో వివిధ వేషాలతో ఆయన నిరసన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+