వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైభవ్ జ్యువెల్లర్స్ మనోజ్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manoj Kumar
బెంగళూరు/విశాఖపట్నం: విశాఖ వైభవ్ జ్యువెల్లర్స్ అధినేత గ్రంథి మనోజ్ కుమార్ హత్య కేసులో కర్నాటక పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ అతని స్నేహితులు రవి కుమార్, కృష్ణయ్యలను కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మనోజ్ కుమార్ ముంబయి వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. క్యాబ్ డ్రైవర్ రవి కుమార్‌ను నిన్ననే విచారించిన పోలీసులు ఆయనను వదిలేశారు. ఈ రోజు ఆయన మృతి చెందడంతో పోలీసులు డ్రైవర్‌ను అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న డ్రైవర్, మరో ఇద్దరిని విచారిస్తున్నారు. అయితే మనోజ్ హత్య దొంగతనం కోసం జరిగిందా? ఏవైనా వ్యాపార లావాదేవీలా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బెంగళూరులోని ఓ సైట్ వివాదం కూడా కావచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయన వద్దనున్న సుమారు రూ.ఐదు నుండి ఆరు కోట్ల రూపాయల విలువైన వజ్రాలు దొంగిలించబడటంతో దొంగతనం కూడా కావొచ్చునని అనుమానిస్తున్నారు.

మనోజ్ మృతితో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగి పోయింది. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. మృతికి సంతాపంగా ఏలూరు, విశాఖ పట్టణ వ్యాపారస్తులు స్వచ్చంధంగా దుకాణాలు మూసి వేస్తున్నారు. మనోజ్ వజ్రాలు కొనేందుకు జైపూర్ వెళ్లారు. అటు నుండి హైదరాబాద్ వచ్చి, అక్కడి నుండి బెంగళూరు వెళ్లారు. బెంగళూరు నుండి ముంబయి వెళ్లే సమయంలో కిడ్నాప్ జరిగింది. మనోజ్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేత అంబికా కృష్ణ ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోజ్ వజ్రాల కొనుగోలు, యాడ్ ఫిల్మ్ కోసం వెళ్లినట్లు తనకు తెలిసిందన్నారు. ఆయన రాజస్థాన్ నుండి శంషాబాద్ అటు నుండి బెంగళూరు వెళ్లారన్నారు. విమానాశ్రయంలో సిసి కెమెరాలు పని చేయక పోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దుశ్చర్యలు జరక్కుండా పోలీసులు అడ్డుకోవాలన్నారు.

English summary
Karnataka police arrested Ravi Kumar, Siva Kumar and Krishnaiah in Vaibhav Jewellers owner Manoj murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X