హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌ను అంటే నాలుక కోస్తాం: టిఆర్ఎస్, సస్పెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులను స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ నుండి రెండు రోజుల పాటు బహిష్కరించారు. బుధవారం సభ ప్రారంభమైనప్పటి నుండి సభ్యులు తెలంగాణ తీర్మానం పెట్టాలంటూ ఆందోళన చేశారు. సభ జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. స్పీకర్ ఎంత చెప్పినా వారు సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని రెండు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిరసిస్తూ సిపిఐ, బిజెపి సభ నుండి వాకౌట్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన అనంతరం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఇది సీమాంధ్ర సభ అని మరోసారి రుజువైందన్నారు. సభలో తమ గొంతు నొక్కేందుకు అధికార, ప్రతిపక్షాలు ప్రయత్నించాయన్నారు.

తెలంగాణ కాంగ్రెసు, టిడిపి నేతలు తెలంగాణపై సభలో నోరు మెదపడం లేదన్నారు. ఈ ప్రభుత్వం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను కాలరాస్తోందన్నారు. తెలంగాణపై తీర్మానం చేయమంటే తమను సస్పెండ్ చేశారన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెసు, టిడిపిలకు బుద్ది చెబుతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు పట్టిన పీడ అని అన్నారు. టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు నిత్యం తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఏమైనా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కెసిఆర్‌ను ఏమైనా అంటే ఖబర్దార్ నాలుక కోస్తామన్నారు. దళిత కుటుంబంలో పుట్టిన మోత్కుపల్లి ఉన్నతంగా ఉండాల్సింది పోయి దిగజారారన్నారు.

కాగా సస్పెన్షన్‌కు గురైన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు... అరవింద్ రెడ్డి, హరీష్ రావు, కావేటి సమ్మయ్య, రవీందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, కెటి రామారావు, కొప్పుల ఈశ్వర్, నల్లాల ఓదేలు, విద్యాసాగర రావు, సోమారపు సత్యనారాయణ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. టిఆర్ఎస్ సభ్యులను సభ నుండి బహిష్కరించడం బాధాకరమని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.

English summary
TRS MLAs warned TDP senior MLA Motkupalli Narasimhulu for criticizing party chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X