దాసరి సీనియర్, చిరంజీవి ప్రత్యేకం: బొత్స సత్తిబాబు

Botsa Satyanarayana
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాసటగా నిలిచారు. దాసరి నారాయణ రావు మరోసారి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ లాబీల్లోని తన ఛేంబర్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దాసరి స్థానంలో చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని సాగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించగా - దాసరి నారాయణ రావు పార్టీలో సీనియర్ అని, మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

చిరంజీవిది పార్టీలో ప్రత్యేక స్థానమని, దాసరితో పోల్చడం సరి కాదని, పాతవారితో పాటు కొత్తవారికి కూడా రాజ్యసభ సీట్లు రావాలని కోరుకుంటున్నానని, ఈ విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని, తాము ఆశావహుల జాబితాను మాత్రమే పంపుతామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెసు పని అయిపోయిందనే ఉద్దేశంతో చాలా మంది పార్టీ నేతలు పార్లమెంటుకు వెళ్తామంటూ ప్రకటిస్తున్నారా అని అడిగితే - ఆలాగేం లేదని, ప్రజలు కాంగ్రెసు పట్ల ఆకర్షణతో ఉన్నారు కాబట్టే తమ వాళ్లు అలా మాట్లాడుతున్నారని సమాధానమిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+