వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దినేష్ త్రివేది అవుట్: రైల్వే మంత్రిగా ముకుల్ రాయ్

పెంచిన చార్జీలను తగ్గించడానికి దినేష్ త్రివేదీ నిరాకరించడంతో మమతా బెనర్జీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. మమతా బెనర్జీ ఢిల్లీలోని కాంగ్రెసు నాయకత్వంతో కూడా మాట్లాడారు. త్రివేదిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మమతా డిమాండ్‌ను కాంగ్రెసు నాయకత్వం వెంటనే అంగీకరించింది. మమతా నిర్ణయం అకస్మాత్తుగా యుపిఎ ప్రభుత్వాన్ని ఆసాధారణ రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. అయితే, తమ ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు లేదని కాంగ్రెసు వర్గాలు అంటున్నాయి. రైల్వే మంత్రి పదవిని చేపట్టనున్న ముకుల్ రాయ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాడు.