వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బడ్జెట్: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేనేత కాంప్లెక్స్‌లు

ఐపివో ప్రక్రియను సరళతరం చేస్తామని ఆయన చెప్పారు. విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడులపై పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగుతుందని ఆయన అన్నారు. కిరోసిన్, వంటగ్యాస్ లబ్ధిదారులకు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. లబ్ధిదారులకు నేరుగా సబ్సిడీ అందించే ప్రక్రియను చేపడతామని చెప్పారు. మౌలిక రంగంలో పెట్టుబడులకు పన్ను రాయితీ కల్పిస్తామని ఆయన అన్నారు. వేయి జనాభా ఉన్న పల్లెలకు స్వాభిమాన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లోనే మైక్రో ఫైనాన్స్ నియంత్రణ బిల్లు ప్రతిపాదిస్తామని చెప్పారు.