మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. నాగం జనార్దన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు పలికింది. నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. తెలుగుదేశం, కాంగ్రెసు అభ్యర్థులు వెనకబడి ఉన్నారు.
నాగం జనార్దన్ రెడ్డి 18 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. కాంగ్రెసు పార్టీ రెండో స్థానంలో నిలువగా తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. నాగం జనార్దన్ రెడ్డి విజయాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా కృషి చేసింది. అయినా ఫలితం సాధించలేకపోయింది.