స్టేషన్ ఘనపూర్‌లో తెరాస అభ్యర్థి రాజయ్య గెలుపు

ఇది ఇలా ఉంటే నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధిక్యత సాధించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెనకంజలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి రెండు ఓట్ల ఆధిక్యం లభించింది. కోవూరులో ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు.