హైదరాబాదే అడ్డు, తేల్చలేం: టి-ఎంపీలకు ఆజాద్ షాక్

దీంతో ఆయన వారితో హైదరాబాద్ పైనే అందరూ పట్టుబడుతున్నారని, ఆ సమస్యకు పరిష్కారం చెప్పాలని వారికి సూచించారు. అలా కాని పక్షంలో తక్షణ పరిష్కారం తెలంగాణపై సులభం కాదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిదని, అది లేని తెలంగాణను మేం ఊహించుకోలేమని వారు ఆజాద్‌కు చెప్పారు. దీంతో ఆయన ఈ అంశంపై అంశంపై మరోసారి చర్చిద్దామని వారికి సూచించారు. కాగా ఆజాద్‌తో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఒప్పుకునేది లేదని చెప్పారు. తెలంగాణపై నాన్చడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పని చేయాలని సూచించామన్నారు. కాంగ్రెస్ పట్ల చిత్తశుద్ధితో ఉన్న తెలంగాణ ప్రాంత కార్యకర్తలు కావాలా, చిత్తశుద్ధి లేని సీమాంధ్ర నేతలు కావాలా అని తాము అధిష్టానాన్ని ప్రశ్నించామన్నారు.