శ్రీలక్ష్మిపై అభియోగాలు, సిబిఐ అదనపు చార్జిషీట్

కాగా, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ పాత్రపై కూడా సిబిఐ చార్జిషీట్‌లో వివరించినట్లు సమాచారం. అలీఖాన్‌ను ఒఎంసి కేసులో హైదరాబాదు తీసుకుని వచ్చేందుకు సిబిఐ ప్రయత్నాలు సాగిస్తోంది. ఎఎంసి కేసులో అతను ప్రస్తుతం బెంగళూర్ జైలులో ఉన్నాడు. ఒఎంసి కేసులో అలీఖాన్ రాజకీయ నాయకులకు, అధికారులకు ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపిస్తున్నారు. అలీఖాన్ ల్యాప్‌టాప్‌ను సిబిఐ ఇది వరకే స్వాధీనం చేసుకుంది. ఇందులో ఆ ముడుపులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒఎంసి కేసులో దాదాపుగా విచారణ పూర్తి అయింది. ఇప్పుడు ముడుపులు అందుకున్నవారిని సిబిఐ అరెస్టు చేస్తుందా, లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. 39 పేజీలు, 14 డాక్యుమెంట్లతో సిబిఐ అదనపు చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ అదనపు చార్జిషీట్‌ను రెండు ట్రంకు పెట్టెల్లో సిబిఐ కోర్టుకు చేర్చింది.