హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెడి బదలీ: బొత్స, కిరణ్‌లపై మండిపడ్డ జగన్ పార్టీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gattu Ramachandra Rao
హైదరాబాద్/తిరుపతి: మద్యం కుంభకోణం విషయంలో ఎసిబి జాయింట్ డెరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బదిలీకి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అని లోకం అంతా కోడై కూస్తుంటే ఆయన మాత్రం ఇతరుల వైపు వేలెత్తి చూపిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు శుక్రవారం ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ బొత్స వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే బొత్సను బర్తరఫ్ చేసి నిష్పక్షపాత విచారణకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న బొత్స బర్తరఫ్‌కు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం లేదని విమర్సించారు. టిడిపి, కాంగ్రెసు నేతలు ఈ కేసులో ఒకరిని మరొకరు కాపాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణంలో ఇద్దరికీ సంబంధముందన్నారు. అందుకే అధికారిని బదలీ చేయిస్తున్నారన్నారు.

మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలు, టిడిపి, కాంగ్రెసు నేతలను వెలికి తీయాలన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. మద్యం మాఫియా కుంభకోణాన్ని మాయ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. సిఎం, పిసిసిల మధ్య విభేదాల వల్ల అధికారులు బలవుతున్నారన్నారు. టిడిపి నేతలు కాంగ్రెసుతో గల్లీలో కొట్లాడుతూ ఢిల్లీలో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెసు, టిడిపిలకు ఉప ఎన్నికల భయం పట్టుకుందని మరో నేత శోభా నాగి రెడ్డి తిరుపతిలో అన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతో ఉప ఎన్నికల వాయిదాకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఎన్నికలు నిర్వహించాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.

English summary

 YSR Congress Party spokes person Gattu Ramachandra Rao lashes out at PCC chief Botsa Satyanarayana and CM Kiran Kumar Reddy for ACB Joint director Srinivas Reddy transefer. He demanded to reveal all the Congress and TDP leaders, who are in liquor syndicate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X