అర్ధరాత్రి హైదరాబాద్‌లో ముంబయి మోడల్ హల్‌చల్!

వారిపై దాడిని పోలీసులు అడ్డుకోబోగా ఆమె వారిని బెదిరించిందట. వారంతంలో నగరంలోని పబ్‌లలో ఈ యువతి ఎప్పుడూ హల్ చల్ చేస్తోందట. తనకు చోటా షకీల్, చోటా కైసర్‌లు తెలుసునని చెబుతూ పబ్ నిర్వాహకులను కూడా హడలెత్తిస్తోందట. తన వెనుక మాఫియా ఉందని ఆమె వారిని, పోలీసులను హెచ్చరిస్తున్నట్లుగా సమాచారం. కాగా ఆమె ముంబయికి చెందిన మోడల్‌గా తెలుస్తోంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కాగా మియాపూర్ పోలీసు స్టేషన్‌లో ఓ నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. రాంరెడ్డి అనే వ్యక్తి పోలీసు స్టేషన్‌లో మృతి చెందాడు. ఈయన మృతదేహాన్ని పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ముషీరాబాద్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎం) ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేశారని అంటున్నారు.
పోలీసులు దారుణంగా హింసించడం వల్లనే రాంరెడ్డి మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు మాత్రం రాంరెడ్డి అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతున్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మియాపూర్ పోలీసులు రాంరెడ్డిని మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఈయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. మదీనాగూడకు చెందిన ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో పోలీసులు రాంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు పెట్టిన వ్యక్తి ఓ రైసు మిల్లు వ్యాపారి అని తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రాంరెడ్డిని అరెస్టు చేశారు.
-
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications