హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతికుంటే వైయస్ జైల్లో ఉండేవారు: విహెచ్ వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు మరోసారి ధ్వజమెత్తారు. బతికి ఉంటే వైయస్ రాజశేఖర రెడ్డి జైలులో ఉండేవారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అయ్య వైయస్ రాజశేఖర రెడ్డి దొంగ, కొడుకు వైయస్ జగన్ దొంగ అని ఆయన అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులు వేల ఎకరాలు లూటీ చేశారని ఆయన ఆరోపించారు.

దోచుకున్న డబ్బులతో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను పెడుతున్నారని ఆయన అన్నారు. వైయస్ విగ్రహాలను పెట్టడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. నూటికి నూరు పాళ్లు వైయస్ రజాశేఖర రెడ్డి అన్యాయం చేశారని ఆయన అన్నారు. వేల ఎకరాల ప్రజల భూములను సెజ్‌ల పేర కట్టబెట్టారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిపై వి. హనుమంతరావు తెరిపి లేకుండా విమర్శలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టు కావడం ఖాయమని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ఆ మధ్య అన్నారు. సత్యం రామలింగరాజు మాదిరిగా వైయస్ జగన్ తప్పులు ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో జగన్ చెప్పాలని, నిజాలను జగన్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశాన్ని దోచుకున్న జగన్ వెంట ఎవరూ నడవవద్దని, జగన్‌తో నడిచేవారికి చివరకు ఏమీ మిగలదని ఆయన అన్నారు. తనతో నడిచివారిని జగన్ జైలు పాలు చేశాడని ఆయన అన్నారు.

జగన్ మాదిరిగానే వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని, వైయస్ బాధితుల్లో తాను ఒక్కడినని, మరో బాధితుడు విజయభాస్కర్ రెడ్డి అని ఆయన అన్నారు. జగన్ వెంట నడిచే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జగన్ తెచ్చేది రామరాజ్యం కాదని, రావణ రాజ్యమని ఆయన అన్నారు. జగన్ చరిత్ర ప్రజలకు తెలుసునని, వచ్చే ఎన్నికల్లో దోచుకున్నవారిని ప్రజలు నమ్మబోరని ఆయన గతంలో కూడా అన్నారు.

English summary

 Congress Rajyasabha member V Hanumanth Rao lashed out YS Rajasekhar reddy once again. He is very critical about YS Rajasekhar Reddy from later's regime also. He alleged that YS Rajasekhar Reddy resorted to illegal activities in land allocation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X