హత్యలు: మోడల్ భార్యను ఉపయోగిస్తున్న గ్యాంగ్‌స్టర్

Mumbai Map
ముంబై: బలవంతంగా ధనవంతుల ఆస్తిని తన పరం చేసుకునేందుకు ఓ మాజీ గ్యాంగ్‌స్టర్ తన భార్యను వినియోగించాడు. ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యాపారుల హత్య కేసులో అతను తన భార్యను పావుగా వాడుకున్నాడు. ముంబయికి చెందిన సదరు మాజీ గ్యాంగ్‌స్టర్ 1998-1999లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అతను ఓ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి బయటకు వచ్చిన అతను తన భార్యను ఉపయోగించి బాగా ఆస్తులు కలిగిన పలువురిని బుట్టలో వేసే వాడని పోలీసులు చెప్పారు.

ఇతను అంతకుముందు గ్యాంగ్‌స్టర్ అని పోలీసులు చెప్పారు. అతను ఓ అండర్ వరల్డ్ డాన్ వద్ద మరో ఇద్దరు సన్నిహితులతో కలిసి పని చేశాడు. ఏప్రిల్ 7న జరిగిన ఓ ఢిల్లీ వ్యాపారి హత్య కేసులో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అయిన గ్యాంగ్‌స్టర్ సదరు వ్యాపారి హత్యకు ముందు నటుడు అయిన అతని కొడుకుతో స్నేహం చేశాడు. ఆ తర్వాత హత్యకు కుట్ర పన్నాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి తమ కస్టడీకి తీసుకున్నారు.

గ్యాంగ్‌స్టర్ భార్యను కూడా పోలీసులు ఏప్రిల్ 12న అరెస్టు చేసారు. ఢిల్లీకి చెందిన ఓ నిర్మాతను అపహరించి, హత్య చేసిన కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో తన వయస్సు మొదట 28గా చెప్పిన ఆ గ్యాంగ్ స్టర్ భార్య ఆ తర్వాత 38గా తెలిపింది. రెండు హత్యల కేసులలోనూ గ్యాంగ్ స్టర్ భార్య పాత్ర ఉన్నదని పోలీసులు చెబుతున్నారు.

ఈ హత్యల కేసులో మృతులతో పరిచయం పెంచుకున్న సదరు భార్య తన గ్యాంగ్ స్టర్ భర్తను వారికి సోదరుడిగా పరిచయం చేసేదట. ఆమెను ఉపయోగించుకునే ఢిల్లీకి చెందిన సదరు వ్యాపారి, నిర్మాతను గ్యాంగ్ స్టర్ హత్య చేసినట్లుగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+