విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ బాబుకు చిన్నం ఝలక్: జగన్ పార్టీలోకి కాదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Chinnam Ramakotaiah
విజయవాడ/చిత్తూరు: తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఇటీవల జోరుగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆయన జగన్ పార్టీలో కాకుండా కాంగ్రెసు తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు.

ఆయన తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తారు. చిన్నం రామకోటయ్య గులాం నబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఇప్పటికే తిరుపతికి చేరుకున్నారని అంటున్నారు. మొదట జగన్ పార్టీలో చేరుదామని అనుకున్నప్పటికీ.. నూజివీడు నియోజకవర్గంలో ఆ పార్టీలో అభ్యర్థి ఇప్పటికే ఉండటంతో కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడమే మంచిదని చిన్నం భావించారని అంటున్నారు. దీంతో ఆయన తన దృష్టి కాంగ్రెసు వైపు సారించారంటున్నారు. అయితే ఆయన కాంగ్రెసు తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ చేరే వరకు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

కాగా 2014లో తనకు నచ్చిన పార్టీ నుండి పోటీ చేస్తానని చిన్నం రామకోటయ్య చెప్పారు. నియోజకవర్గంలో పోటీ నడుస్తోందని, 2014లో తనకు టిక్కెట్ ఇస్తానని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, కానీ క్యాడర్ తనకు అనుకూలంగా ఉంటుందనే నమ్మకం తనకు లేదని ఆయన అన్నారు. తాను ఇప్పుడు పార్టీ మారితే లాభం లేదని, తనకు అన్ని పార్టీలు సమానమే అన్నారు. అన్ని పార్టీలతో తనకు మంచి సంబంధముందని ఆయన చెప్పారు.

తన ఆశయాలు ఏ పార్టీ ద్వారా నెరవేరుతాయని భావిస్తానో అందులో చేరతానని అన్నారు. గులాం నబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోందని ప్రశ్నించగా.. తనకు ఆజాద్ వచ్చే విషయమే తెలియదని, తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీ నేతగానే ఉంటానని స్పష్టం చేశారు. శనివారం చిన్నం రామకోటయ్య బాబుతో భేటీ అయిన తర్వాత టిడిపిలో ఉంటానని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన తన అసంతృప్తిని బయట పెట్టడం విశేషం.

English summary
It is said that, Nuziveedu Telugudesam party MLA Chinnam Ramakotaiah may join in Congress party in the presence of central minister Ghulam Nabi Azad on Sunday at Tirupati. But Chinnam condemned joining in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X