హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం పదవే అయితే..: దామోదర్, బైపోల్స్‌పై పాలడుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవే కావాలనుకుంటే రెండేళ్ల క్రితమే వచ్చేదని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి బుధవారం అన్నారు. తాము ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తలేమని తెలంగాణ కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి పరిస్థితి వివరిస్తామని చెప్పారు. తెలంగాణ జెఏసి ఉందని ఎవరూ భావించడం లేదని అంటున్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు రెండు ప్రాంతాలలో నష్ట పోవాల్సి ఉంటుందన్నారు.

తెలంగాణ ఇస్తే 17 పార్లమెంటు స్థానాలను 2014లో గెలుచుకుంటామని చెప్పారు. ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. కాంగ్రెసు నాయకత్వంపై తెలంగాణ ప్రజలలో నమ్మకం కలగడం లేదన్నారు. అందుకే పరకాలలో ఓటమి చెందామన్నారు. అయితే తమకు తమ పార్టీపై నమ్మకం ఉందన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై అధిష్టానం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నారు. అందుకు తాము ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. 2014లో సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెసు తీవ్రంగా దెబ్బ తింటుందన్నారు. కాంగ్రెసు పార్టీ పటిష్టత కోసం మంత్రులు త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

మరోవైపు కాంగ్రెసు తప్పులు దిద్దుకుంటుందని ప్రజలలో నమ్మకాన్ని కలిగించలేక పోయామని పాలడుగు వెంకట్రావు అన్నారు. తమ పార్టీ చేసిన వాగ్ధానాలలో 30 శాతం కూడా నెరవేర్చలేక పోయిందన్నారు. పార్టీ ఓటమిపై నలుగురైదుగురు కూర్చొని చర్చిస్తే సరిపోదని... అందరితై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని సూచించారు. ఎన్నికలలో భారీగా హామీలు ఇచ్చామని చెప్పారు. వ్యాపారం ద్వారా కోట్లు గడిస్తూ ప్రజా సేవ చేస్తామంటే ప్రజలు నమ్మరని చెప్పారు.

English summary
Former minister Damodar Reddy responded on chief minister post to Telangana leaders. He said Telangana people demanding for Telangana state but not CM post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X