అమెరికాకు అప్పగించనంటే స్వీడన్ వస్తా: అసాంజ్

తాను స్వీడన్ వెళ్తే తనను స్టాక్‌హోమ్ అమెరికాకు అప్పగిస్తుందేమోనని ఆయన భయపడుతున్నారు. యుకె, అమెరికా, స్వీడన్ అసాంజ్‌కు ఏ విధమైన హామీలు ఇస్తాయనే విషయంపై వ్యవహారం ముందుకు సాగుతుందని ఆయన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో అన్నారు.
అఫ్గనిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించిన సున్నతమైన పత్రాలను, ఇతర వేలాది దౌత్యపరమైన కేబుల్స్‌ను అసాంజ్ వికీలీక్స్ ద్వారా బయటప్రపంచానికి వెల్లడించారు. ఈ వ్యవహారంపై అసాంజ్‌ను అమెరికా విచారించేందుకు సిద్ధపడుతోంది. దీంతో ఆయనను తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది.
గ్రాండ్ జ్యూరీ దర్యాప్తును నిలిపివేస్తామని, వికీలీక్స్ ప్రచురణలపై తదుపరి దర్యాప్తులు ఆపేస్తామని అమెరికా ప్రకటించాలని అసాంజ్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే అసాంజ్‌కు కావాల్సిన ప్రధానమైన హామీ అని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications