వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండోసారి: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అన్సారీ నామినేషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hamid Ansari
న్యూఢిల్లీ: యుపిఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్ అన్సారీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి అయిన లోకసభ కార్యదర్శి విశ్వనాథన్‌కు అన్సారీ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు మద్దతిచ్చే వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. నామినేషన్ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్, ప్రధాని మన్మోహన్ సింగ్, ఫరూక్ అబ్దుల్లా, బాలు, శరద్ పవార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీయే అభ్యర్థిగా జశ్వంత్ సింగ్ ఉప రాష్ట్రపతి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సర్వేపల్లి రాధాకృష్ణ రెండుసార్లు పోటీ చేశారు. ఆ తర్వాత హమీద్ అన్సారీ కూడా రెండోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో అన్సారీ వామపక్షాల మద్దతుతో యుపిఏ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

అన్సారీ 790 ఓట్లకు గాను 470 ఓట్లు పొందే అవకాశముందని కాంగ్రెసు భావిస్తోంది. ఒకవేళ తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చినట్లుగానే అన్సారీకి కూడా ఓకే అంటే మరో 28 ఓట్లు పెరిగే అవకాశముంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో గెలవాలంటే అన్సారీకి 396 ఓట్లు రావాలి.

కాగా రాష్ట్రపతి ఎన్నికలు జూలై 19న జరగనున్న విషయం తెలిసిందే. యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ బరిలో నిలవగా ఎన్డీయే అభ్యర్థిగా పిఏ సంగ్మా రేసులో ఉన్నారు. అన్సారీ రెండోసారి నామినేషన్ వేయడం తనకు సంతోషాన్ని ఇస్తుందని ప్రధాని చెప్పారు.

English summary
Hamid Ansari, the incumbent Vice-President and UPA's candidate for this year's vice-presidential election, filed his nomination on Wednesday and thanked all political leaders who pledged him support. Prime Minister Manmohan Singh said he was happy that Ansari had a big support behind him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X