వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది రాహుల్ నిర్ణయించుకోవాల్సిందే: సోనియా గాంధీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: పార్టీలో రాహుల్ గాంధీ నిర్వహించాల్సిన పాత్రను ఇతరులు ఎవరూ నిర్ణయించబోరని, రాహుల్ గాంధీయే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. పార్టీలో మరిన్ని బాధ్యతలను తీసుకుంటూ ముఖ్య పాత్రను పోషించే విషయంలో నిర్ణయం రాహుల్ గాంధీ తీసుకోవాల్సిందేనని ఆమె అన్నారు.

ఉప రాష్ట్రపతి పదవికి హమీద్ అన్సారీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైన సోనియా గాంధీ పార్లమెంటు హౌస్‌లో బుధవారం ఆ విధంగా అన్నారు. రాహుల్ గాంధీ పార్టీలో మరింత ముఖ్య భూమికను పోషిస్తారని, తన పార్టీకి సంబంధించి మరింత ఎక్కువ బాధ్యతలను చేపడుతారని దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్జీద్ వంటి నాయకులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోనియా గాంధీ ఆ విధంగా ప్రతిస్పందించారు.

2014 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని లేదా ఉపాధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలున్నాయా అని అడిగితే అది రాహుల్ నిర్ణయించుకోవాల్సిందేనని సోనియా అన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెస్తారనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి.

ప్రధానిగా మన్మోహన్ సింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ అంతర్జాతీయ మీడియాలో కూడా వార్తాకథనాలు వచ్చాయి. ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిగా చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ముందు పెడుతారనే ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది.

English summary
Congress president Sonia Gandhi on Wednesday said it is for Rahul Gandhi to decide for himself on playing a larger role in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X