అమెరికాలోని థియేటర్లో కాల్పులు, 12 మంది మృతి

The Dark Knight Rises
కొలరాడో: అమెరికాలోని కొలరాడో నగరంలో ముసుగు ధరించిన దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ముసుగు ధరించిన పలువురు ఉన్మాదులు నగరంలోని డెన్వర్ థియేటర్‌లో ది డార్క్ నైట్ రైజెస్ సినిమా ప్రివ్యూ చూస్తున్న ప్రేక్షకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వారు ప్రేక్షకులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.

అనంతరం వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందారు. మరో యాభై మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి పూట ప్రివ్యూ చూస్తున్న వారిపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం తెలుస్తోంది. ముసుగేసుకోవడంతో వారిని గుర్తించలేదని చెబుతున్నారు.

కాల్పుల ఘటన తెలియగానే భద్రతా దళాలు భారీగా అక్కడకు చేరుకున్నాయి. డెన్వర్ థియేటర్‌ను చుట్టు ముట్టాయి. దుండగుల కాల్పుల కారణంగా థియేటర్ మొత్తం నెత్తురోడింది. సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాల్పులు జరిగిన దుండగుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు.

ఒక దుండగుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఉగ్రవాదుల చర్యనా లేక మరేదైనా ఉందా అనే విషయం దుండగులను ప్రశ్నించిన అనంతరం తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+