మన్మోహన్ సరే ఒబామా!: టైమ్‌కు ఔట్లుక్ కౌంటర్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అండర్ అచీవర్‌గా పేర్కొంటూ ఓ కథనం రాసిన అమెరికన్ టైమ్ మ్యాగజైన్‌కు మన దేశానికి చెందిన ఔట్లుక్ పత్రిక గట్టి కౌంటర్ ఇస్తోంది. రెండు వారాల క్రితం అమెరికన్ మ్యాగజైన్ టైమ్ ప్రధానిని అశక్తుడిగా పేర్కొంటూ ఘాటైన కథనం రాసిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల అమలులో వెనుకబడుతున్నారని టైమ్ తన కథనంలో పేర్కొంది.

దానికి కౌంటర్‌గా ఓట్లుక్ పత్రిక అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాని అండర్ అచీవర్‌గా పేర్కొంది. బరాక్ ఒబామా పరిపాలనను తెగనాడుతూ.. ఆయన ముఖచిత్రంతో ఉన్న ఈ ఔట్లుక్ మ్యాగజైన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. టైమ్ మ్యాగజైన్ మన్మోహన్ ముఖ చిత్రంతో ఎలాగైతే 'ది అండర్‌అచీవర్' హెడ్డింగ్‌తో పుస్తకాన్ని వెలువర్చిందో ఓట్లుక్ కూడా ఒబామా ముఖచిత్రంతో 'ది అండర్‌అచీవర్'తో పుస్తకాన్ని అలాగే బయటకు తీసుకు రానుంది.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నాలుగేళ్ల క్రితం తాను అమెరికాను ప్రగతి పథంలోకి తీసుకు వెళతానని చెప్పి అధికారంలోకి వచ్చాడని, కానీ ఇన్నేళ్ల తన పరిపాలనలో అతను సాధించిందేమీ లేదని పేర్కొంది. ఆయన తెచ్చిన మార్పు ఎవరికీ కనిపించడం లేదని పేర్కొంది. టైమ్ పత్రిక జూలై 7 సంచికలో మన్మోహన్ గురించి కథనం ప్రచురించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications