వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానమే చూసుకుంటుంది: విహెచ్‌పై పురంధేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandheswari
విజయవాడ: తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వ్యవహారాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పార్టీ బాగు కోసం తాను ఎంత చెప్పినా ఎవరూ వినడం లేదని, ధర్మాన నేతృత్వంలోని మంత్రుల కమిటీ నివేదిక సరిగా లేదంటూ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై ఆమె వాఖ్యానించడానికి నిరాకరించారు. అయితే ధర్మాన కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి ఇచ్చిందని, ఇదే నివేదికను అధిష్టానానికి కూడా పంపుతారని, అక్కడ పార్టీ బలోపేతానికి కచ్చితంగా ఏం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు.

విజయవాడ పూర్ణానందం పేటలో నూతనంగా నిర్మించిన ఒక హోటల్ ప్రారంభోత్సవానికి ఆమె, ఆమె భర్త వెంకటేశ్వరరావు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హోటల్‌లోనే ఆమె మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. అయితే ఇటీవల నీతి, నిజాయితీలకు సంబంధించి బాగా చర్చ జరుగుతోందని, నైతిక విలువలు పాటించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్న విషయమై ఆమె బదులిస్తూ, బాధ్యతగల పదవులలో ఉన్న వ్యక్తులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, తప్పుచేస్తే నిజాయితీగా ఒప్పుకుని పదవి నుంచి వైదొలగడం మంచిదేనని చెప్పారు.

ఇలాంటి విషయంలో మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్నకు ఆమె భర్త, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందిస్తూ, నైతిక విలువలు పాటించాలనేది ఒకరు చెబితే నేర్చుకునేది కాదని, ఎవరికి వారే పాటించాలని, ఎవరి పరిధిలో వారే అవినీతికి పాల్పడకుండా ఉండడం మంచిదని సూచించారు. దీనిపై పురంధేశ్వరి స్పందిస్తూ, తమ విషయానికి వస్తే ఎటువంటి అనవసర వ్యాఖ్యలు చేయమని, చేతలలోనే చూపిస్తామన్నారు.

రాహుల్‌గాంధీని మంత్రి వర్గంలోకి తీసుకోవడంలో తప్పులేదన్నారు. ఆయనకు అందరి సహకారం ఉంటుందని, ఆయన కూడా అందరి సహకారంతో ముందుకు వెళతారని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంలో ఎవరి పరిధిలో వారు కృషి చేయడంలో తప్పులేదన్నారు. రాహుల్‌గాంధీ ప్రచారం వల్లే యుపీలో ఐదు శాతం ఓట్లు పెరిగిన విషయాన్ని గుర్తించాలని చెప్పారు.

English summary
Union minister Daggubati Purandheswari said that Congress high command will look into the issue of Rajyasabha member V Hanumanth Rao. She told that she will not speak politics here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X