హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏఐఎస్ఎఫ్ ఆందోళన: ఎమ్మెల్యే చంద్రావతి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

MLA Chandravathi
హైదరాబాద్: సాంఘీక సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం, మెస్ ఛార్జీల పెంపును కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హాస్టళ్లలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించంపై శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. అధికారులు హాస్టళ్లలో నిద్రించడం కాదని, సమస్యలను పరిష్కరించాలన్నారు.

ధర్నా అనంతరం పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు సచివాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. ఈ ధర్నాలో సిపిఎం భద్రాచలం ఎమ్మెల్యే చంద్రావతి కూడా పాల్గొన్నారు. ఆమె ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయ ముట్టడికి బయలుదేరారు. పోలీసులు వారిని మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో సచివాలయాన్ని ముట్టడించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుండటంతో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే చంద్రావతిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు డౌన్ డౌన్, ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

English summary
Khammam district MLA Chandravathi and AISF student leaders were arrested by Hyderabad police on Friday at Indira Park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X