• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్‌ను వేలెత్తి చూపిస్తావా, అంతు చూస్తా: గట్టు

By Pratap
|

Gattu Ramachandra Rao
హైదరాబాద్: తమకు కోరేందుకు బీసీ సంఘాలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. మద్దతు ఇవ్వాలంటూ బీసీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్రరావు బహిరంగ దూషణలు, హెచ్చరికలకు పాల్పడ్డారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాలుగు బీసీ సంఘాల నేతలతో గట్టు సమావేశమయ్యారు.

తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయలక్ష్మికి బీసీ నేతలు మద్దతు తెలిపితే రానున్న ఎన్నికల్లో బీసీలకు వంద టికెట్లు కేటాయిస్తామని గట్టు ప్రకటించారు. అనంతరం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్‌కు మాట్లాడే అవకాశం వచ్చింది. వైఎస్ విధానాల వల్ల బీసీలు నష్టపోయారని, 93 మాత్రమే ఉన్న బీసీ కులాల జాబితాలో మరిన్నింటిని చేర్చి 139 కులాలు చేశారని ఆయన అన్నారు.

ఒక్కరి భోజనం నలుగురికి పెడతామంటే ఎలాగని ప్రశ్నించారు. 2009 ఎన్నికల్లో కూడా 100 టికెట్లు ఇస్తామని చె ప్పి 65 మాత్రమే ఇచ్చారని, వైయస్ విధానాలతో బీసీలకు తీవ్ర నష్టం జరిగిందని, వైయస్ తమకు ద్రోహం చేశారని అంటూ ఇప్పుడు కూడా అలా జరగదన్న గ్యారంటీ ఏమిటని అడిగారు. దీంతో గట్టు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

"వైఎస్‌నే వేలెత్తి చూపేటంతటివాడివా? నువ్వెంత.. నీ వయసెంత? నిలబెట్టి ముక్కలు ముక్కలుగా నరికిస్తా. నిలబడ్డ చోటే మాయమైపోతావు. హుస్సేన్‌సాగర్‌లో శవమై తేలుతావు జాగ్రత్త'' అంటూ పత్రికల్లో రాయలేని అసభ్యకర పదజాలంతో నరేందర్ గౌడ్‌పై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా నరేందర్‌పై దాడి చేసేందుకు పైపైకి వెళ్లగా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.

ఒక్క ఫోన్ చేస్తే చాలు మనుషులు వచ్చి చంపేస్తారని, ఎవరు అడ్డు వస్తారో చూస్తానంటూ బెదిరించారు. అప్పటివరకు సజావుగా సాగిన సమావేశం ఒక్కసారిగా మారిపోవడంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ సమావేశంలో బీసీ చైతన్య వేదిక, బీసీ యునైటెడ్ ఫ్రంట్, దూదేకుల సంఘం నేతలు పాల్గొన్నారు.

గట్టు వల్ల తనకు ప్రాణహాని ఉందని, భవిష్యత్తులో తనకు ఏదైనా జరిగితే అందుకు రామచంద్రరావుదే బాధ్యత అని నరేందర్‌గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు చంపడానికి సిద్ధమైతే జాతి కోసం చావడానికైనా తాను సిద్ధమేనని చెప్పారు. బెదిరించి మద్దతు తీసుకోవాలనుకోవడం సరికాదని హెచ్చరించారు. అసలు వైయస్సార్ కాంగ్రెసులో ఉన్న బీసీ నేతలెందరని అడుగుతూ వారిచ్చే డబ్బులకు ఆశపడి గట్టు రామచంద్రరావు లాంటివాళ్లు ఇలా తమను బెదిరిస్తున్నారని తెలిపారు.

గతంలో శ్రీకాకుళం జిల్లాలో జగన్ ఓదార్పుయాత్ర చేసినప్పుడు కళింగ వైశ్యులను కూడా బీసీ జాబితాలో చేరుస్తామని ప్రకటించారని, ఇప్పుడు వంద సీట్ల పేరుతో మరో మోసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. సమావేశం పేరుతో ఆ పార్టీ నేతలు తమను పిలిచి ఫ్యాక్షనిస్టు తరహాలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

English summary

 YSR Congress party leader Gattu Ramachandar Rao threatened BC leader Narendra Goud for criticising YS Rajasekhar Reddy. He threatened to see his end, if he continue to criticise YSR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X