ఈ ఇద్దరు కలిసి వస్తే థియేటర్లు తగలబడడమే.. కొత్త మూవీ టీజర్ రిలీజ్ !!
విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం "కార్మేని సెల్వం". ఈ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రామ్ చక్రి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్నారు. అలానే లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తుంది. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని పెంచగా.. లేటెస్ట్ గా తెలుగు టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచుతుంది.

కాగా అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు వంటి విషయాలను వివిధ కోణాల్లో చూపిస్తూ నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి.
అలానే లక్ష్మీ ప్రియా చంద్రమౌళి ఆయన భార్యగా, చిన్న కుమారుడితో కుటుంబ జీవితం చూపిస్తుండగా, మరోవైపు విదేశాల్లో ఒంటరిగా కనిపించే కొన్ని షాట్లు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను గోప్యంగా ఉంచడం కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది. టీజర్ చివర్లో.. "రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి... డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి" - అని సముద్రఖని చెప్పే డైలాగ్ ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించేలా నిలుస్తుంది. నటన పరంగా మెస్మరైజ్ చేసే సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి నటిస్తుండడంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.
-
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం












Click it and Unblock the Notifications