మా ఆవిడ బంగారం: హీనా ప్రేమాయణం వార్తలపై భర్త

Hina Rabbani Khar
హైదరాబాద్: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టోల మధ్య ఎలాంటి ప్రేమాయణం సాగలేదని హీనా రబ్బానీ భర్త, పారిశ్రామికవేత్త ఫిరోజ్ గుల్జార్ స్పష్టం చేశారు. హీనా - భుట్టోల ప్రేమాయణం నడుస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. మా ఆవిడ బంగారమంటూ ఆయన కితాబు ఇచ్చారు. కేవలం ప్రచారం, సంచలనాల కోసమే ఇలాంటి పుకార్లు సృష్టిస్తుంటారని ఆయన మండిపడ్డారు.

ప్రస్తుతం ఇంటర్నెట్‌ సమాజంలో పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ తనయుడు బిలావల్ భుట్టో‌ల లవ్ స్టోరీపై హాట్ హాట్‌ చాటింగ్ సాగుతోంది. అయితే, పాకిస్థాన్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఖర్, బిలావల్ ఇద్దరు కలిసి ఉండగా జర్దారీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని బంగ్లాదేశ్‌కు చెందిన "ది వీక్లీ బ్లిడ్జ్" అనే టాబ్లాయిట్ ఓ కథనం ప్రచురించింది. దీనిపై హీనా భర్త ఫిరోజ్ గుల్జార్ స్పందించారు.

తన భార్య పరపతిని తగ్గించేందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ తంతంగంలోకి తన ఇద్దరు పిల్లలను కూడా లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహాధ్యక్షుడు బిలావల్ భుట్టోతో తనకు వివాహేతర సంబంధం లేదని పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ స్పష్టం చేశారు.

అయితే, పాకిస్థాన్‌లో ఐఎస్ఐ అదుపులోకి తీసుకున్న వేలాదిమంది కనిపించకుండాపోవడంపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తునకు హీనా రబ్బానీ అంగీకరించారని, దాంతో ఐఎస్ఐ ఆమెపై గుర్రుగా ఉందని, వివాహేతర సంబంధం కథనాలు దాని కుట్రేనని పీపీపీ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+