వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐన్‌స్టీన్, స్టీఫెన్‌హాకింగ్‌ల కన్నా మేధావి 12ఏళ్ల బాలిక!

By Srinivas
|
Google Oneindia TeluguNews

ld girl has IQ higher than Einstein's
లండన్: ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అల్‌బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల మేథస్సును మించి ఓ పన్నెండెళ్లకు అపారమైన తెలివి తేటలు ఉన్నాయని ప్రపంచ మేధావుల సంఘం 'మెన్నా' ప్రకటించింది. బ్రిటన్ దేశ రాజధాని లండన్‌లో చదువుతున్న పన్నెండేళ్ల బాలిక ఒలివియా మ్యానింగ్ అత్యంత తెలివైన అమ్మాయిగా మెన్నా గుర్తించింది.

అంతేకాదు ఆమెను తమ సంఘంలో సభ్యురాలిగా చేర్చుకుంది. ఆమె ఐక్యూ 162గా ఉన్నట్లు వారు తెలిపారు. ఆమె ఐక్యూ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల ఐక్యూ కన్నా రెండు పాయింట్లు ఎక్కువని వారు తేల్చారు. వారి కంటే రెండు పాయింట్ల ఐక్యూ ఎక్కువగా ఉండటమే కాదు.. ప్రపంచంలో ఉన్న ఒక్క శాతం తెలివైన వారిలో ఆమెనే టాప్‌ అని చెప్పారు.

ఈ విషయాన్ని డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది. మెన్సాలో ఆమెను చేర్చుకోవడం ద్వారా ఆమె ఎనలేని కీర్తిని సంపాదించుకుంది. కొత్త విషయాలను ఎప్పటికి అప్పుడు గుర్తు పెట్టుకుంటూ అడిగిన వెంటనే ఠక్కున సమాధానం చెప్పేస్తోంది. ఆమె తెలివితేటలను పరీక్షించేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ఐక్యూ సంస్థ మెన్నా పరీక్ష పెట్టడంతో ఆమె ఐక్యూ 162గా నమోదైంది.

English summary
With an IQ of 162, a 12-year-old schoolgirl in UK has been rated brainier than even Albert Einstein and Stephen Hawking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X