ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్, రోశయ్య అప్పులు నేను కట్టా: బాటలో కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ఒంగోలు: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అప్పులు తాను చెల్లించానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన ఇందిర బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 2008 నుండి కాంగ్రెసు ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తున్నప్పటికీ వారు చెల్లించలేదని, ఆ అప్పులు ఇప్పుడు తాను చెల్లిస్తున్నానని ఆయన చెప్పారు.

ఇంతకుముందు సిఎంల బకాయిలు తాను చెల్లిస్తున్నానని, అందులో భాగంగా రూ.8,300 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మత్సకారుల బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచామన్నారు. బడ్జెట్‌ను రూ.235 కోట్లు చేశామన్నారు. సముద్ర తీరాన ప్రాజెక్టులు, ఆయిల్ రిఫైనరీలతో మత్సకారులకు నష్టం జరుగుతోందన్నారు. మత్సకారుల పడవలకు డీజిల్ ధరలో సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కిరణ్ చెప్పారు.

అందరికీ విద్య అవసరమని కానీ, మత్సకారుల పిల్లలు మాత్రం విద్యకు దూరంగా ఉంటున్నారని, దానిపై తాను దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఓ హైస్కూల్ కోరారని, దానిని ఏర్పాటు చేస్తామన్నారు. సముద్రాలలో వచ్చే సునామీని కనుగొనే కేంద్రాన్ని హైదరాబాదులోనే పెట్టారని చెప్పారు. ఆధునిక యంత్రాల ద్వారా చేపలు ఎక్కడ బాగా పడతాయో కూడా మత్సకారులకు తెలుపవచ్చునని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

మత్సకారులకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా రూ.20 వేలు చెల్లించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు సౌకర్యాలు కల్పించామని, వచ్చే రెండేళ్లలో అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నాలా ఛార్జీల బకాయిలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మత్సకారుల వల్ల రాష్ట్రానికి రూ.11 కోట్ల ఆదాయం వస్తుందని, వారి డిమాండ్లను పరిశీలిస్తున్నామని, వాడ రేవు రోడ్ల నిర్మాణాన్ని కూడా వేస్తామని చెప్పారు. మత్సకారులకు సంవత్సరానికి రూ.50 కోట్లు ఖర్చవుతుందన్నారు.

English summary
CM Kiran Kumar Reddy on Tuesday in his Indira Bata said that he was paid late YS Rajasekhar Reddy's and former CM Konijeti Rosaiah's dues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X