• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హరికేన్ శాండీతో గజగజ వణుకుతున్న అమెరికా

By Pratap
|

 Hurricane Sandy expected to stun US
న్యూయార్క్: హరికేన్ శాండీ విలయాన్ని అమెరికాలోని న్యూజెర్సీ ఇప్పటికే చవి చూస్తోంది. న్యూజెర్సీ తీర ప్రాంతం హరికేన్ తాకిడి ప్రభావాన్ని చవి చూస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ వంటి మహానగరాల్లో బీభత్సం సృష్టించే స్థాయిలో హరికేన్ చుట్టుముట్టే ప్రమాదం ఉంది. 31 అడుగుల ఎత్తున భారీ కెరటాలు సృష్టించేందుకు శాండీ హరికేన్ సిద్ధమైనట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్ నుంచి 3.70 లక్షల మందిని ఖాళీ చేయించారు. 9 రాష్ట్రాల్లోని ఆరు కోట్ల మంది ప్రజలపై తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా.

తుఫాను వల్ల ధ్వంసమయ్యే ఆస్తుల విలువ దాదాపు రూ. 16,224 కోట్లు ఉంటుందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనే జ్‌మెంట్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. ఇంకా నీళ్లు, పడిపోయే చెట్లు, విద్యుత్ సంక్షోభం వల్ల జరిగే నష్టం ఇందుకు మరిన్ని రెట్లు అధికంగా ఉంటుందని అంటున్నారు. న్యూజెర్సీలో 22 లక్షల మందికి విద్యుత్తు అందుబాటులో లేకుండా పోయింది. వాషింగ్టన్ డీసీ, మేరీలాండ్, మసాచుసెట్స్, న్యూయార్క్ సహా పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు.

ఎన్నికలు ముంచుకొచ్చిన నేపథ్యంలో ఈ హరికేన్ రావడంతో ఇటు అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ తమ ప్రచారర్యాలీలను రద్దుచేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున మట్టిపెళ్లలు విరిగిపడే ప్రమాదముందని, దాదాపు 1300 కిలోమీటర్ల తూర్పు కోస్తా తీరం వెంబడి ఇది ప్రళయం సృష్టిస్తుందని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

దీని కారణంగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు యూరప్, ఆసియా ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చే 7,600 విమానాలను రద్దుచేశాయి. న్యూయార్క్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉండగా, ఫిలడెల్ఫియాలో ఇప్పటికే సబ్‌వేలను మూసేశారు. స్కూళ్లు, మాళ్లు, సూపర్‌మార్కెట్లు, చివరకు స్టాక్ ఎక్స్ఛేంజిలు కూడా మూతపడ్డాయి. బోస్టన్, వాషింగ్టన్, బాల్టిమోర్ ప్రాంతాల్లో స్కూళ్లు మూసేశారు. వాషింగ్టన్ డీసీ, ఫిలడెల్ఫియా, న్యూయార్క్‌ల మీదుగా వెళ్లే మెట్రో రైళ్లను సైతం ఆపేశారు. పలు ప్రాంతాల్లో ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు.

చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని సైతం మూసేశారు. సమితి సమావేశాలన్నింటినీ రద్దుచేశారు. అణు నియంత్రణ కమిషన్ అధికారులు మొత్తం దేశంలోని అన్ని అణు విద్యుత్ ప్లాంట్ల వద్దకు ఇన్‌స్పెక్టర్లను పంపి, తుఫాను ప్రభావంపై పరీక్షలు చేయిస్తున్నారు. నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజి కూడా సోమవారం మూతపడింది. 76 చోట్ల పాఠశాలల్లో తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. న్యూయార్క్‌లోని 468 సబ్‌వే స్టేషన్లు, బస్సులు, రైళ్లను కూడా ఆపేశారు.

పలు ప్రాంతాల్లో రాబోయే 5-7 రోజుల పాటు విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని పంపిణీ సంస్థలు తెలిపాయి. దీంతో ముందుగానే నీరు, ఆహార పదార్థాలు, జనరేటర్లు, బ్యాటరీలు, ఇతర అత్యవసర పదార్థాలను కొనుగోలు చేసేందుకు దుకాణాల వెలుపల భారీ క్యూలైన్లు కనిపించాయి. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ తుఫాను వల్ల మూతపడ్డాయి. ట్రైవీసా కార్యాలయాలను సైతం తాత్కాలికంగా మూసేశారు.

శాండీ హరికేన్ వల్ల గంటకు 138 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో ఇప్పటికే కరేబియన్ దీవుల్లో 65 మంది మరణించారు. ప్రస్తుతం అది న్యూయార్క్‌కు 500 కిలోమీటర్ల ఆగ్నేయంగా కేంద్రీకృతమై గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. దీంతో ఇప్పటికే డెలావేర్ నుంచి 50వేల మందిని, భారతీయులు ఎక్కువగా ఉండే అట్లాంటిక్‌సిటీ నుంచి 30 వేల మందిని ఖాళీ చేయించారు. ఓషన్ సిటీ, మేరీలాండ్ నుంచి కనెక్టికట్, రోడ్ ఐలండ్ ప్రాంతాల్లో 8 అడుగుల మేర నీరు నిలిచే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. వర్జీనియా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని అంగుళాల మేర మంచు పేరుకుపోయే అవకాశముంది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసేయాలని న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ ఆదేశించారు.

మన దేశం నుంచి నెవార్క్‌కు వెళ్లే విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. శాండీ హరికేన్ వల్ల న్యూయార్క్, నెవార్క్‌లకు వెళ్లే విమానాలను నిరవధికంగా రద్దు చేసినట్లు ఎయిరిండియా తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 9డబ్ల్యు 227, 9డబ్ల్యు 228 విమానాలను రద్దుచేశారు. ఈనెల 30, 31 తేదీల్లో వెళ్లే విమానాలు సైతం రద్దయినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులు తర్వాతి తేదీలకు తమ ప్రయాణాలను మార్చుకోవచ్చని, అందుకు జరిమానా ఏమీ ఉండబోవని అన్నారు. ముంబై-నెవార్క్ మధ్య తిరిగే ఏఐ 191, ఢిల్లీ-న్యూయార్క్ ఏఐ 101 విమానాలను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.

అది న్యూయార్క్‌కు 500 కిలోమీటర్ల ఆగ్నేయంగా కేంద్రీకృతమై గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. దీంతో ఇప్పటికే డెలావేర్ నుంచి 50వేల మందిని, భారతీయులు ఎక్కువగా ఉండే అట్లాంటిక్‌సిటీ నుంచి 30 వేల మందిని ఖాళీ చేయించారు. ఓషన్ సిటీ, మేరీలాండ్ నుంచి కనెక్టికట్, రోడ్ ఐలండ్ ప్రాంతాల్లో 8 అడుగుల మేర నీరు నిలిచే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. వర్జీనియా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని అంగుళాల మేర మంచు పేరుకుపోయే అవకాశముంది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసేయాలని న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ ఆదేశించారు.

మన దేశం నుంచి నెవార్క్‌కు వెళ్లే విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. శాండీ హరికేన్ వల్ల న్యూయార్క్, నెవార్క్‌లకు వెళ్లే విమానాలను నిరవధికంగా రద్దు చేసినట్లు ఎయిరిండియా తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 9డబ్ల్యు 227, 9డబ్ల్యు 228 విమానాలను రద్దుచేశారు. ఈనెల 30, 31 తేదీల్లో వెళ్లే విమానాలు సైతం రద్దయినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులు తర్వాతి తేదీలకు తమ ప్రయాణాలను మార్చుకోవచ్చని, అందుకు జరిమానా ఏమీ ఉండబోవని అన్నారు. ముంబై-నెవార్క్ మధ్య తిరిగే ఏఐ 191, ఢిల్లీ-న్యూయార్క్ ఏఐ 101 విమానాలను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.

English summary
Sandy, one of the biggest storms ever to hit the United States, roared ashore with fierce winds and heavy rain on Monday near the gambling resort of Atlantic City, New Jersey, after forcing evacuations, shutting down transportation and interrupting the presidential campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X