వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోత్కుపల్లి కన్నీరు: శ్రీకాకుళంకు లోకేష్, భువనేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothukupalli Narasimhulu
హైదరాబాద్: పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. మృతి తీరని లోటు అని, నిరంతరం ప్రజల కోసం పని చేసిన వ్యక్తి అన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర కోసం నిరంతరం సలహాలు ఇస్తుండేవారన్నారు. ఈ మృతిని చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారన్నారు.

ఎనిమిదిసార్లు ఆయన ప్రజాప్రతినిధిగా గెలుపొంది ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ అందరికి దగ్గరగానే ఉండేవారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎవరు పిలిచినా పలికే వ్యక్తి అన్నారు. నిత్యం గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఆ తర్వాత ఓడిపోయినప్పటికీ పార్టీలో కష్టపడి పని చేశారన్నారు. పార్టీ పట్ల అంకితభావంతో, విధేయతతో, విశ్వాసంతో మెలిగే వారన్నారు. చంద్రబాబు ఏ ఆదేశాలు ఇచ్చినా పాటించేవారన్నారు.

ముప్పయ్యేళ్లు పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన తమలాంటి జూనియర్లకు మంచి మంచి సూచనలు ఇచ్చే వారన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. టిడిపి క్యాడర్ పూర్తి శోకసముద్రంలో మునిగిపోయింది.

శ్రీకాకుళం బయలుదేరిన చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్‌లు కూడా బయలుదేరారు. ఎర్రన్నాయుడి తల్లి, భార్య కన్నీరుమున్నీరయ్యారు. నిమ్మాడలో విషాదఛాయలు అంటున్నాయి. హైదరాబాదు నుండి తమ్ముడు, ఢిల్లీ నుండి తనయుడు శ్రీకాకుళం బయలుదేరారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu said he lost his right hand with Yerrannaidu dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X