సోనియా సంతాపం: రేపు అధికారిక అంత్యక్రియలు

ఎర్రన్నాయుడు మృతికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరి, సిపిఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బిసిలకు ఎర్ర్నాయుడి మృతి తీరని లోటు అని సీతారాం ఏచూరి అన్నారు.
ఎర్రన్నాయుడి మృతి బిసిలకు తీరని లోటు అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూనే బిసిల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ఎర్రన్నాయుడి మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం ఆదేశించారు. రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications