ఆటో డబ్బులు: బాల సాయిబాబాకు ఐటి నోటీసులు?

బాలసాయిబాబా ట్రస్ట్‌కు సంబంధించిన ఫైళ్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తెలపాల్సిందిగా ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. కాగా మూడు రోజుల క్రితం ఆ డబ్బు తమదేనని రియల్ ఎస్టేట్ వ్యాపారి రామారావు సీసీఎస్ పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈయన బాల సాయిబాబా ట్రస్టు చైర్మన్‌గా ఉన్నారు. దీంతో బాల సాయిబాబాకు నోటీసులు ఇవ్వాలని ఐటి శాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఆటోలో దొరికిన ఆరున్నర కోట్ల రూపాయలు తనవేనని రామారావు పోలీసులకు తెలిపారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. తాను చంపాపేట యాక్సిస్ బ్యాంక్ నుండి రూ.2 కోట్లు తీసుకున్నానని, అవన్నీ రూ.500 నోట్లని, అలాగే కర్నాటక నుండి ఆరున్నర కోట్ల రూపాయలు, వెయ్యికోట్ల కట్టలు వచ్చినట్లు తెలిపారు. ఆ డబ్బు తనదే అని అతను ముందుకు రావడంతో పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు.
దొరికిన డబ్బు అంతా కొత్త నోట్లేనని తెలుస్తోంది. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ నుండి డ్రా చేశారు. సీరియల్ నెంబర్ల ఆధారంగా డబ్బు ఎవరిదో తెలుసుకోవచ్చునని చెబుతున్నారు. ఇవి రాజకీయ నాయకుడివా లేక పోలీసులను ఆశ్రయించిన వ్యాపారివా తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆ డబ్బు తనదేనని పోలీసుల విచారణలో రామారావు తెలిపారు. తాను లాండ్ కొనేందుకే ఆ డబ్బును ఆటోలో తరలిస్తున్నట్లుగా పోలీసులకు చెప్పాడు. అతను నాలుగున్నర కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పినప్పటికీ మరో రెండు కోట్ల రూపాయలకు చెప్పలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో బాల సాయిబాబుకు నోటీసులు ఇవ్వాలని ఐటి శాఖ అనుకుంటోంది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications