వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు టీమ్: ఈ నేతలంతా ఏమయ్యారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేతలు పలువురు దూరమయ్యారు. వీరిలో కొంత మంది ఇతర పార్టీల్లోకి జంప్ చేయగా, కొంత మంది మౌనంగా ఉండిపోయారు. గతంలో క్రియాశీలక పాత్ర పోషించిన ముఖ్య నాయకులు కూడా మౌనముద్ర పట్టారు. వారిని క్రియాశీలం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ విధమైన ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు.

విజయరామారావు మౌన ముద్ర

తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేత విజయరామారావు. సిబిఐ డైరెక్టర్‌గా పనిచేసిన విజయరామారావును పార్టీలోకి తీసుకుని వచ్చి చంద్రబాబు పెద్ద పీట వేశారు. విజయరామారావుకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చి, అదే సామాజిక వర్గానికి చెందిన కె. చంద్రశేఖర రావుకు ఇవ్వలేకపోయారు. దానివల్లనే అలక వహించి కెసిఆర్ పార్టీ నుంచి తప్పుకుని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని స్థాపించారని అంటారు. ఇప్పుడు విజయరామారావు మౌనంగా ఉంటున్నారు. పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కూడా అయిన ఆయన పార్టీలో ఏ మాత్రం క్రియాశీలకంగా లేరు.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అలక..

ఎన్టీ రామారావు హయాం నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుది పార్టీలో కీలకమైన పాత్ర. తీర్మానాలు తయారు చేయడంలో, పార్టీకి సంబంధించిన వ్యవస్థీకృత వ్యవహారాలను పర్యవేక్షించడంలో ఆయనది అందె వేసిన చేయి. ఆయన చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పోలిట్‌బ్యూరో సభ్యుడు కూడా అయిన ఆయన కాపులకు పార్టీలో సరైన స్థానం లభించడం లేదంటూ అలక వహించి దూరంగానే ఉంటున్నారు.

 నందమూరి హరికృష్ణ ఎందుకో...

చంద్రబాబు పాదయాత్ర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ హంగామా చేసిన నందమూరి హరికృష్ణ ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఉన్నారు. ఆయన చంద్రబాబు పాదయాత్రలో ప్రముఖ పాత్ర పోషించకపోవడానికి గల కారణాలేమిటో తెలియదు. అలక వీడి ఆయన చంద్రబాబుతో రాజీకి వచ్చారనే ప్రచారం జరిగింది.

 నాగం జనార్దన్ రెడ్డి వేరు కుంపటి

తెలుగుదేశం పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి అత్యంత కీలకమైన నేతగా వ్యవహరించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి అక్రమాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడి తెలుగుదేశం పార్టీకి అవినీతిపై జరిగిన పోరాటంలో అగ్రభాగం అందించినవారిలో ఆయన ఒకరు. తెలంగాణపై చంద్రబాబు వైఖరి నచ్చక బయటకు వచ్చేసి తెలంగాణ నగారా సమితిని పెట్టుకున్నారు. శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ గెలిచారు.

జగన్ పార్టీలోకి మైసురా జంప్


తెలుగుదేశం పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఎంవి మైసురారెడ్డిది ప్రధాన పాత్ర. రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని తెచ్చి, వైయస్ అవినీతిపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంలో మైసురా రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి వైయస్ జగన్ పార్టీలో చేరిపోయారు.

విజయ రామారావు వంటి నాయకులు మౌన ముద్ర పట్టినా, మైసురా రెడ్డి వంటి సీనియర్ నాయకులు పార్టీ వీడినా ఆయన ఏ మాత్రం తొణికినట్లు కనిపించడం లేదు. పైగా, వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడానికి సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ సుదీర్ఘమైన పాదయాత్రలో చంద్రబాబు వెంట కొంత మంది నాయకులు ఎల్లవేళలా ఉంటున్నారు.

పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన, సీనియర్ నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, బోడ జనార్దన్, చెంగల వెంకట్రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. బివి మోహన్ రెడ్డి, ముద్దసాని దామోదర్ రెడ్డి వంటి నాయకులు మరణించారు. కె. ఎర్రంనాయుడు ప్రమాదంలో మరణించడం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం.

తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్న నాయకుల్లో అల్లాడి పి. రాజ్‌కుమార్ ఒక్కరు. ఆయన కూడా ఈ మధ్య తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు. హైదరాబాద్, సికింద్రబాదు జంటనగరాల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి ఓ బలం.

English summary
Telugudesam party president N Chandrababu Naidu is facing trouble with the senior leaders attitude. Leaders lije Vijayarama Rao are bot actibe and leaders lije Nysura Reddy left the party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X