• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిన్నవాడు, చాలా బాధేసింది: బాలయ్యపై పురంధేశ్వరి

By Pratap
|
Purandeswari
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో తనపై తన సోదరుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఖండించారు. బాలకృష్ణ రాసిన బహిరంగ లేఖపై ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద ప్రతిస్పందించారు. పార్లమెంటులో ప్రతిష్టాపనకు తాను ఒక్కదాన్నే విగ్రహం ఇవ్వాలని గానీ, ఆ కీర్తిని తాను మాత్రమే కొట్టేయాలని గానీ అనుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు.

బాలకృష్ణ తనకన్నా చిన్నవాడని, బాలకృష్ణ వ్యాఖ్యలతో తనకు చాలా బాధేసిందని ఆమె అన్నారు. తనపై చేసిన విమర్శలను చూసిన తర్వాత తాను ఫోన్ చేసి బాలయ్యతో మాట్లాడానని, తాను అనలేదని బాలకృష్ణ అంటున్నారని ఆమె అన్నారు. తన సంతకం కోసం ఎప్పుడు వచ్చావని అడిగితే రాలేదని బాలకృష్ణ అంగీకరించారని ఆమె అన్నారు. తన సంతకం కోసం బాలకృష్ణ ఎప్పుడు వచ్చాడో తనకు తెలియదని, ఆలా ఎప్పుడూ రాలేదని ఆమె అన్నారు.

రెండు మూడు సార్లు తనకు ఫోన్ చేశానని బాలకృష్ణ అన్నాడని, అప్పుడు కుటుంబపరంగా విగ్రహాన్ని ఇద్దామని తాము అనుకున్నామని, అయితే తన సంతకం లేకుండానే పార్లమెంటుకు వారు లేఖ ఇచ్చారని ఆమె అన్నారు. బాలయ్య తనకన్నా చిన్నవాడని, తనపై చేసిన వ్యాఖ్యలను బాలయ్య విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు. వివాదానికి తాను కారణం కాదని, వివాదం ఎందుకు చోటు చేసుకుందో దాన్ని సృష్టించినవాళ్లనే అడగాలని ఆమె అన్నారు. అసలు వివాదమే లేదని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో తనకు స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ అందగానే తాను తన కన్నా పెద్దవాళ్ల ఇళ్లకు వెళ్లి విషయం మాట్లాడానని, తనకన్నా చిన్నవాళ్లను తన ఇంటికి అహ్వానించి మాట్లాడానని, కుటుంబపరంగా ఎన్టీ రామారావు విగ్రహం ఇద్దామని చర్చించుకున్నామని ఆమె వివరించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఇంటికి కూడా తాను మూడు సార్లు లేఖను పంపించానని, అది తీసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరనే సమాధానం వచ్చిందని ఆమె అన్నారు. తాను ఒక్కదాన్నే ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా అందరూ భాగస్వాములు కావాలి, కలిసి చేద్దామనే మాట మీద తాను నిలబడుతున్నానని ఆమె అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Union Minister and NT Rama Rao daughter Daggubati Purandeswari has condemned his brother and Telugudesam party leader Nandamuri Balakrishna's comments on the installation row of NTR statue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more